Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరికాయలను తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:08 IST)
చాలామందికి బానపొట్ట ఉంటుంది. దీని కారణంగా అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని బాధపడుతుంటారు. పదిమందిలో తిరగాలంటే అవమానంగా ఉంటుంది. ఈ బానపొట్టను తగ్గించదానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభాలు కనిపించడంలేదని బాధ పడుతుంటారు. వాటన్నింటిని పక్కన పెట్టి కింది చెప్పబడిన చిట్కాలు పాటిస్తే.. బానపొట్ట తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
1. కప్పు జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా బెల్లం కలిపి మరికాసేపు మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ మోతాదులో రోజూ తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కూడా తగ్గుముఖం పడుతుంది. 
 
2. జీలకర్రను నూనెలో వేయించుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో కలిపి స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యాలు కూడా దరిచేరవు. 
 
3. ఉసిరికాయలు ఈ సీజల్‌లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. దాంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా తగ్గుతుంది. అలానే ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరికాయ రసాన్ని తాగితే ఫలితం ఉంటుంది. 
 
4. ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి సేవిస్తే.. రుచి బాగుంటుంది. నోటికి పుల్లగా, కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయను తిన్న తరువాత నీటిని వెంటనే తాగరాదు.. అలా తాగితే గొంతు పట్టుకుంటుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఓ 10 లేదా 15 నిమిషాల తరువాత నీరు తీసుకోవాలి. 
 
5. మెంతులు ఆకలిని పెంచుతాయి. రాత్రి నిద్రకు ముందుగా కప్పు మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. శరీరా ఆరోగ్యానికి మంచి ఔషధంగా, టానిక్‌లా పనిచేస్తుంది.   

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments