Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే టీ, కాఫీలొద్దు.. హెర్బల్ టీనే ముద్దు

Webdunia
గురువారం, 13 జులై 2023 (19:54 IST)
Herbal Tea
ఉదయాన్నే కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్న చాలామంది ఇకపై కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా హెర్బల్ టీ తాగేందుకు ఆసక్తి చూపితే ఆరోగ్యంగా వుండవచ్చు. హెర్బల్ టీ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. హెర్బల్ టీ ఆరోగ్యకరమైన జీవితానికి ఒక వరం. 
 
ఇది జీర్ణక్రియ, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
ఈ హెర్బల్ టీ ముఖ్యంగా జలుబు, దగ్గును దూరం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. హెర్బల్ టీ శరీరానికి మంచిదే అయినప్పటికీ టీ తయారీ విధానంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  
 
శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి హెర్బల్ టీని సిప్ చేస్తున్నప్పుడు, దానికి చక్కెరను జోడించకుండా, తేనెను జోడించవచ్చు.
 
స్థూలకాయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నించే వారు తేనెలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే, వేడి హెర్బల్ టీలో తేనెను ఎప్పుడూ కలపకూడదు. టీ ఒక మోస్తరు వేడికి వచ్చిన తర్వాత తేనె కలపాలి.
 
హెర్బల్ టీని చాలా వేడిగా లేదా చాలా చల్లగా తాగవద్దు. గోరువెచ్చగా సిప్ చేస్తే మంచిది. హెర్బల్ టీని మళ్లీ వేడి చేసి సిప్ చేయకూడదు. పిత్త సంబంధిత సమస్యలు ఉన్నవారు హెర్బల్ టీ తాగడం మానుకోవాలి.
 
జీర్ణం కాని ఆహారం తిన్నప్పుడు హెర్బల్ టీ తాగడం మంచిదని, అల్లం టీ, పుదీనా, సోంపు కలిపి తాగడం వల్ల శారీరకంగా జరిగే నష్టాన్ని నివారించవచ్చని వైద్యులు తెలిపారు. కాబట్టి రెగ్యులర్ టీ, కాఫీ తాగడం కంటే హెర్బల్ టీ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

తర్వాతి కథనం
Show comments