Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామకాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (16:40 IST)
జామకాయ జ్యూస్ కాలేయానికి మంచి టానిక్ లాంటిది. ఈ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను చాలా ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను జామకాయ తగ్గిస్తుంది.
 
ఇకపోతే.. జామకాయలను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామఆకులు గ్రేట్‌గా సహాయపడుతాయి. జామఆకులను పేస్ట్‌గా తయారుచేసి, దంతాలు, చిగుళ్ళమీద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే ఇది జీర్ణక్రియకు అవసరం అయ్యే జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ హెల్తీ లీఫ్ టీ లేదా జ్యూస్ తీసుకొన్నప్పుడు ఫుడ్ పాయిజన్‌ను నివారించుకోవచ్చు. అలాగే జామకాయను రోజూ రెండేసి తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జామపండులో విటమిన్ ఎ,సిలు ఉండటం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ పండులోని యాంటీ-యాక్సిడెంట్లు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్‌ను జామకాయ తినడం ద్వారా నిరోధించుకోవచ్చు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments