అలెర్జీలకు చెక్ పెట్టే కరివేపాకు.. ఎలాగంటే?

కరివేపాకు లేని తాలింపు వుండదు. కూరల్లో వంటల్లో కరివేపాకు తప్పనిసరి. కరివేపాకు రుచి, సువాసకు మాత్రమే కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి... వడగట్టి ఆ నూనెను తలక

Webdunia
బుధవారం, 18 జులై 2018 (13:01 IST)
కరివేపాకు లేని తాలింపు వుండదు. కూరల్లో వంటల్లో కరివేపాకు తప్పనిసరి. కరివేపాకు రుచి, సువాసకు మాత్రమే కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి... వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు వత్తుగా పెరుగుతాయి.
 
అలెర్జీలతో బాధపడేవారు.. కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఓ స్పూన్ మోతాదులో నెలరోజుల పాటు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇక కరివేపాకు, వేప పేస్టు అర స్పూన్ మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
 
వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా నేటి యూత్‌కు చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేసింది. తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకుని మాత్రం వేయించి లేదా ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో కరివేపాకు పొడిని అదే మోతాదులో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని.. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: ఇట్లు అర్జున లో హాయ్ రే సాంగ్ మెస్మరైజింగ్ చేస్తుంది: నాని

Sandeep Kishan : సిగ్మా మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం : సందీప్ కిషన్, జేసన్ సంజయ్

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, సినీ నటుడు ఉపేంద్ర కర్నాటక సీఎం అవుతారా?

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

తర్వాతి కథనం
Show comments