Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే జీలకర్రను ఇలా చేసి తాగితే....!

ఉదయాన్నే జీలకర్ర నీటిని ఇలా తాగితే చాలు ఎలాంటి కొవ్వు అయినా కరిగిపోతుందట. జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (20:58 IST)
ఉదయాన్నే జీలకర్ర నీటిని ఇలా తాగితే చాలు ఎలాంటి కొవ్వు అయినా కరిగిపోతుందట. జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారుచేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. 
 
జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలంటే... ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. దీంతో కింద చెప్పిన లాభాలు కలుగుతాయట.
 
1. జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. కడుపులో పురుగులు ఉంటే చనిపోతాయి.
 
2. జీలకర్ర నీటిని తాగితే గర్భిణీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీర గ్రంథులను ఉత్తేజం చేస్తాయి.
 
3. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్‌ఫుల్ మెడిసిన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది. దాని వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి.
 
4. జీలకర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు రావు.
 
5. సహజసిద్ధమైన యాంటీ వైరల్‌, యాంటీ బయోటిక్‌, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి. కనుక ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తగ్గుతాయి.
 
6. జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలలో రాళ్లు కరుగుతాయి. మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి పోతాయి.
 
7. కడుపులో వికారం ఉండడం, తల తిప్పడం, త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది.
 
8. కడుపులో ఏర్పడే అల్సర్లను, పుండ్లను తగ్గించడంలో జీలకర్ర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రోజూ కొద్దిగా జీలకర్ర నీటిని తాగితే చాలు. దీంతో ఆయా సమస్యలు దూరమవుతాయి.
 
9. జీలకర్ర నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారు.
 
10. నిద్రలేమితో బాధ పడేవారు జీలకర్ర నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి.
 
11. జీలకర్ర నీటిని ఓ నెల రోజులపాటు ఉదయాన్నే తాగటం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఒంట్లో కొవ్వు కరిగి పోతుంది..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పింకీ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా నాన్నా, నన్ను క్షమించు: భర్త సూసైడ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : అంతుచిక్కని కేజ్రీవాల్ వ్యూహాలు... ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం!

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...

తూచ్.. అదంతా ఫేక్ : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన అయోధ్య రామిరెడ్డి (Video)

సూర్యాపేటలో పరువు హత్య.. కులాంతర వివాహం చేసుకున్నాడని కొట్టి చంపారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

తర్వాతి కథనం
Show comments