ప్రతిరోజూ జీలకర్రను తీసుకుంటే?

జీలకర్ర లేని వంటిల్లు లేదు. దీనిని ఎక్కువగా కూరల్లో వాడుతుంటాం. ఇది రెండు రకాలుగా దొరుకుతాయి. అవి నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. ఈ రెండింటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీలకర

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (12:49 IST)
జీలకర్ర లేని వంటిల్లు లేదు. దీనిని ఎక్కువగా కూరల్లో వాడుతుంటాం. ఇది రెండు రకాలుగా దొరుకుతాయి. అవి నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర. ఈ రెండింటిలో అనేక ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర కషాయంతో తామర, తెల్లమచ్చలు వంటివి తొలగిపోతాయి. ఇంగువ, జీలకర్ర, సైంధవ లవణాన్ని పాలలో కలుపుకుని పొడిచేసుకోవాలి.
 
ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. నులి పురుగుల సమస్యలు కూడా తొలగిపోతాయి. జీలకర్ర కషాయాన్ని ప్రతిరోజూ తీసుకుంటే గుండెనొప్పి వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుటకు జీలకర్ర ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఈ కషాయాన్ని తాగడం వలన సైనస్ నుండి ఉపశమనం లభిస్తుంది.
 
జీలకర్రను నేతిలో దోరగా వేయించుకుని ఆ మిశ్రమాన్ని పొడిచేసి అందులో సైంధవ లవణం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రెండుపూటల తీసుకుంటే గర్భాశయ బాధలు తగ్గుతాయి. ఈ పొడిని అన్నంలో, మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే కూడా మంచిది. ధనియాలు, జీలకర్రను వేయించి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో సైంధవ లవణం, ఉప్పును వేసి కలుపుకోవాలి. 
 
ఈ పొడిని పాలలో లేదా అన్నంలో కలుపుకుని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుటలో చాలా సహాయపడుతుంది. జీలకర్రను నిమ్మరసంలో కలుపుకుని తీసుకుంటే తలతిప్పడం, వేడి తదితర అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తరుణ్ భాస్కర్.. గాయపడ్డ సింహం నుంచి సెటైరికల్ రాప్ సాంగ్

Santosh Krishnan: విలేజ్ బ్యాక్ డ్రాప్ తో R చిత్రం ప్రారంభం

Devakonda: హృదయాలను తాకుతున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ గీతం సంచారమే

Manchu Laxmi: లేచింది మహిళాలోకం మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు, నవ్వించే చిత్రం: మంచు లక్ష్మి

Raviteja: డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి

తర్వాతి కథనం
Show comments