Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు.. మజ్జిగలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే..

మిరియాల్లో పోషకాలు పుష్కలం. చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం

Webdunia
గురువారం, 4 మే 2017 (12:10 IST)
మిరియాల్లో పోషకాలు పుష్కలం. చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని దూరం చేస్తాయి. 
 
ఒక గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. 
 
వేసవిలో అధిక దాహం ఉన్నవారు కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే మంచిది. కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments