Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంత సంరక్షణకు పురాతన ఔషధం కలబంద

కాలిన గాయాలు, గాట్లు తదితర నొప్పులను కలబంధ మొక్కలోని ఔషధగుణాలు సమర్ధవంతంగా నివారించగలవని ఎప్పుడో 10వ శతాబ్దంలోనే నిరూపించారు. గ్రంధస్తం చేశారు. దంత సంరక్షణలోనూ దీని పాత్ర ఎన్నదగినదని తాజా పరిశోధనల్లో

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (20:32 IST)
కాలిన గాయాలు, గాట్లు తదితర నొప్పులను కలబంధ మొక్కలోని ఔషధగుణాలు సమర్ధవంతంగా నివారించగలవని ఎప్పుడో 10వ శతాబ్దంలోనే నిరూపించారు. గ్రంధస్తం చేశారు. దంత సంరక్షణలోనూ దీని పాత్ర ఎన్నదగినదని తాజా పరిశోధనల్లో తేలడంతో కలబంధకు ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుతున్నాయి. చర్మ సంరక్షణిగా దీనికెలాంటి స్థానం ఉందో అదేవిధంగా దంత సంరక్షణకు ఉపయోగించే జెల్‌లు, పేస్ట్‌లు వగైరాలలో దీన్ని దంతక్షయ నివారిణిగా ఉపయోగిస్తున్నారని తాజా అద్యయనం ఒకటి వెల్లడించింది. 
 
సాధారణ టూత్‌పేస్ట్‌ ఏ రకమైన ఫలితాలనిస్తుందో అదే విధమైన ఫలితాలను కలబంధ జెల్‌ కూడా ఇస్తుందని అధ్యయనం వెల్లడిస్తోంది. నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బాక్టీరియాను నిర్మూలించడంలో కలబంధ జెల్‌ నిర్వహించే పాత్ర చాలా ప్రశంశనీయమైనదని అధ్యయనం పేర్కొంది. దంతక్షయ నివారణలో కలబంధ జెల్‌ నిర్వహించే పాత్ర ప్రస్తుతం దంత వైద్యనిపుణుల పరిశోధనలు సాగుతున్నాయి. సాధారణ వాణిజ్య టూత్‌పేస్ట్‌లు రెండు కనబరిచే సామర్థ్యం కన్నా కలబంధ జెల్‌ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలనిస్తోందని ఈ అధ్యయనం తెలియజేస్తోంది.
 
 కొన్ని సందర్భాల్లో కలబంధ జెల్‌ పనితీరే చాలా ఎక్కువగా ఉందని తేలింది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమైన బాక్టీరియా నిర్మూలనలో దీని జెల్‌దే పైచేయిగా అధ్యయనం తేల్చింది. దీని వలన మరో ఉపయోగం కూడా ఉంది. కొన్ని రకాల టూత్‌పేస్ట్‌లు అందరికీ సరిపడవు. ముఖ్యంగా సున్నితమైన దంతాలున్న వారికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఇలాంటి వారికి కలబంధ జెల్‌ మేలైనదని అధ్యయనం వివరించింది. టూత్‌పేస్ట్‌లతో సంతృప్తి పడని వారికి కలబంధ చాలా చక్కని ప్రత్యామ్నాయమని అధ్యయనం వెల్లడిస్తోంది. 
 
అలాగని అన్ని రకాల కలబంధ జెల్‌లు ఒకే ఫలితమిస్తాయని అపోహ పడవద్దని అధ్యయనం హెచ్చరిస్తోంది. కలబంధతో తయారైన అన్నిటిలోను దీని పరిమాణం ఒకే రీతిలో, ఒకే స్థాయిలో ఉండకపోవడమే దీనికి కారణం. కలబంధ మొక్క కాండం మధ్య భాగాన ఉండే పదార్థాన్ని ఉపయోగించిన జెల్‌లోనే దీని సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సామర్థ్యం నిలకడగా ఉండటానికి తయారీదారులు కూడా కొన్ని ప్రమాణాలను పాటించాలనేది అధ్యయనవాదుల అభిప్రాయం.

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

తర్వాతి కథనం
Show comments