Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి సమస్యలు వేధిస్తున్నాయా? కరివేపాకు పచ్చడి లేదా పొడి తీసుకోండి..

నెలసరి సమస్యలు వేధిస్తున్నాయా? అయితే కరివేపాకును వాడండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ తరం అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కరివేపాకు పొడిని వేడి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (10:22 IST)
నెలసరి సమస్యలు వేధిస్తున్నాయా? అయితే కరివేపాకును వాడండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ తరం అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆకలిలేమి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఆహారంలో కరివేపాకు తప్పకుండా వాడాలి. 
 
కరివేపాకులో మహిళలకు కీలకంగా ఉపయోగపడే ల్యూటిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, ఇనుమూ, క్యాల్షియం, నియాసిన్‌, బీటాకెరటిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రుతుక్రమ సమస్యలతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే వేసవిలో కరివేపాకుని చల్లటి మజ్జిగలో వేసి, కాస్త వామూ, ఉప్పూ కలిపి తాగండి. జీర్ణశక్తి పనితీరు మెరుగుపెడుతుంది. 
 
ఇంకా చెప్పాలంటే కరివేపాకును పచ్చడి లేదా పొడి రూపంలో తీసుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమిని తొలగించుకుంటే బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది. కరివేపాకు క్యాల్షియం, ఇనుమూ సమపాళ్లల్లో శరీరానికి అందుతాయి. ఫలితంగా నెలసరి క్రమబద్ధం అవుతుంది. రక్తంలోని చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments