Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకుల వైద్యం... ఉదయం, రాత్రి ఇలా చేసి చూడండి...

ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం తులసి. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారతదేశంలో చాలామంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థా

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:25 IST)
ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం తులసి. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారతదేశంలో చాలామంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన పెరట్లో దొరికే దివ్యౌషధం. తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. తులసి మొక్కకు ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం.
 
* కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 
* ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి తాగితే కఫం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
* జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
 
* కళ్ళు మంటలు, కళ్ళ వెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 
* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే జ్వరం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
 
* తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 
* తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
 
* తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. 
 
* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments