Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలమైన గుండె కోసం ఏం చెయ్యాలి?

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడూ పని బిజీలో ఉండటం వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పి వస్తోంది. అలాంటి గుండె నొప్పి రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుక

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (20:03 IST)
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడూ పని బిజీలో ఉండటం వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పి వస్తోంది. అలాంటి గుండె నొప్పి రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
 
తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుకుని రోజూ త్రాగితే గుండె జబ్బులు రావు. మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రోజూ కాసిన్ని ఎండు ద్రాక్ష తింటే గుండె బలంగా ఉంటుంది.
 
ఎండు అంజూరపు పళ్ళను జీలకర్రను సమ భాగాలుగా కలిపి పొడి చేసుకొని చెంచా తేనెలో కలిపి రోజూ తీసుకొంటే గుండెదడ, గుండెపోటు వంటివి రావు. అక్రూట్ కాయలు గుండెకు ఎంతో మంచివి.
 
లేత చింతచిగురు, గుండెకు చాలా మంచిది. దానిని కూరలలో వేసుకొని కానీ పొడి చేసుకొని కానీ తినవచ్చు. చిటికెడు కుంకుమపువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి పుచ్చుకుంటే గుండె బలంగా ఉంటుంది. దానిమ్మ గింజలు, దానిమ్మ ఆకుల రసం అన్ని రకాల గుండె జబ్బులను నివారిస్తుంది.
 
చెంచా ఉసిరికాయ పొడిలో చెంచా తేనె కలిపి రోజూ తీసుకొంటే గుండెకు మంచిది. నాలుగు లేక ఐదు వెల్లుల్లి దెబ్బలను నేతిలో వేయించి రోజూ మధ్యాహ్న భోజనానికి ముందు తింటే గుండె బలంగా ఉంటుంది. ఇది వార్థక్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments