Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ కొత్తిమీర కషాయం తాగితే..?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:53 IST)
కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. తగిన ఔషధ కషాయం తాగాల్సిందేనని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్నిరకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తేనే మేలు. మరి కొన్నింటిని మాత్రం కషాయమే చేయాలి. ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు. కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికల ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాల ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి. 
 
కొందరైతే చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ కషాయం ఎలా చేయాలో ఓసారి తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - గుప్పెడు
నీరు - 1 గ్లాస్
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడి.. ఆపై 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వలన పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు ఎంతో దోహదం చేస్తుంది.
 
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. కొత్తిమీర కషాయం తీసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

తర్వాతి కథనం
Show comments