Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువను స్త్రీలు తీసుకుంటే.. రుతుక్రమ నొప్పులు మటాష్

ఇంగువలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంగువ వాత సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దగ్గును దూరం చేస్తుంది. శ్వాస సంబంధిత రోగాలను నయం చేస్తుంది. పేగుల్లోని క్రిముల్ని వెలివేయడంలో బాగా పనిచేస్తుంది.

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (14:21 IST)
ఇంగువలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంగువ వాత సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దగ్గును దూరం చేస్తుంది. శ్వాస సంబంధిత రోగాలను నయం చేస్తుంది. పేగుల్లోని క్రిముల్ని వెలివేయడంలో బాగా పనిచేస్తుంది. నరాల బలహీనతతో ఏర్పడే మూర్ఛ వ్యాధుల్ని దరిచేరనివ్వదు. ఇంగువ బాలింతల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా ఇంగువను నూనెలో నానబెట్టి గాయాలపై రాయడం చేస్తే ఉపశమనం లభిస్తుంది. నూనెలో కరిగిన ఇంగువను చెవుల్లో రెండు బొట్లు వదిలితే చెవినొప్పి మటుమాయం అవుతుంది. 
 
ఇంగువను నూనెలో వేయించి తీసుకోవడం మంచిది. బాలింతలకు ప్రసవానికి అనంతరం.. వెల్లుల్లి, పటిక బెల్లానికి కాసింత ఇంగువ పొడిని చేర్చి.. ఆ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంతో తీసుకుంటే.. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.  
 
స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి, సక్రమంగా లేని, బాధతోకూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన మందుగా పని చేస్తుంది. పంటిపై పడకుండా అరస్పూన్ ఇంగువ పొడి లేదా ఇంగువను నోటిలో వేసుకుని నీరు తాగిస్తే.. రుతుక్రమ నొప్పులు తగ్గిపోతాయి.  శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ అయిన ఇంగువ వ్యతిరేక కాన్సర్ లక్షణం ప్రాణాంతక కణాల పెరుగుదలను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

తర్వాతి కథనం
Show comments