Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునాముఖి చూర్ణం వేడి ఆవుపాలతో కలిపి సేవిస్తే...

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (21:08 IST)
సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటుంన్నాం అనే దాని మీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అదెలా అంటే, ఒక స్పూన్ సునాముఖి ఆకు చూర్ణాన్ని, అరకప్పు వేడి ఆవుపాలతో కలిపి సేవిస్తే రక్త శుద్ధి కలుగుతుంది. శరీరం కూడా కాంతిమంతమవుతుంది. 
 
నేతితో సేవిస్తే శరీరంలోని అనేక రుగ్మతలు పోతాయి. పంచదారతో సేవిస్తే వాతం తగ్గుతుంది. తేనెతో సేవిస్తే ధాతుపుష్టి కలుగుతుంది. మేక పాలతో తీసుకుంటే శరీరం బలిష్టమవుతుంది. పాత బెల్లంతో తీసుకుంటే జలుబు తగ్గుతుంది. గుంటగలగరాకు రసంతో అయితే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్షపండు రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది.
 
3 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా పటికబెల్లం కలిపి రోజుకి రెండుపూటలా సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది.
 
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లతో సేవిస్తే, సుఖ విరేచనం కలుగుతుంది.
 
రెండున్నర గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు వాడితే కండ్ల జబ్బులు నయమవుతాయి.
 
5 గ్రాముల ఆకు చూర్ణానికి 10 గ్రాముల దోసగింజల చూర్ణం కలిపి సేవిస్తే మూత్రద్వారానికి అడ్డుపడే రాళ్లు కరిగిపోతాయి.
 
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తింటూ వుంటే అన్ని రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

తర్వాతి కథనం
Show comments