Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నూనెను నీటిలో కలిపి ఇలా చేస్తే.. ఏమవుతుంది..?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (10:17 IST)
మల్లెపువ్వులు వాసన చాలా బాగుంటుంది. ఈ పువ్వుల వాసన మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే చాలామంది స్త్రీలు మల్లెపువ్వులను పెట్టుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి మల్లెపువ్వులతో తయారుచేసే నూనె ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
మల్లెపువ్వులు స్త్రీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాంటి పువ్వులతో నూనె తయారుచేసుకుని ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా ఈ నూనెను కలుపుకుని స్నానం చేస్తే శరీర నొప్పులు తగ్గుతాయి. ఇప్పటి వేసవికాలంలో మల్లెపువ్వులు ఎక్కువగా దొరుకుతాయి. రెండు చుక్కల మల్లెపువ్వుల నూనెను ఓ శుభ్రమైన వస్త్రంపై వేసుకుని దాని వాసన పీల్చుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే.. శరీర ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా, ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
మల్లెపువ్వుల నూనెను ఫేస్‌వాష్‌లా కూడా వాడుకోవచ్చును. కొన్ని చుక్కల మల్లెపువ్వుల నూనె, కొద్దిగా కొబ్బరినూనెను సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మర్దనా చేసుకోవాలి. కాసేపటి తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతోపాటు చర్మం మృదువుగా కూడా తయారవుతుంది. 
 
కొన్ని చుక్కల మల్లెపువ్వుల నూనెకు కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి శరీర నొప్పులకు రాసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ఆలివ్ నూనెను బదులు వేడినీరు కూడా ఉపయోగించుకోవచ్చును. కానీ వేడి నీటితో అయితే కాపడం పెట్టాల్సి ఉంటుంది. తరచు జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు.. మల్లెపువ్వుల నూనెను జుట్టుకు రాస్తుంటే.. సమస్య తగ్గుముఖం పడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments