Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి రెండు సార్లు మునగాకు తీసుకుంటే?

మునగలో ఔషధాలెక్కువ. మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మునగాకు రసం రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఒత్తిడిని నయం చేస్తుంది. వారానికి రెండుస

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (13:40 IST)
మునగలో ఔషధాలెక్కువ. మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మునగాకు రసం రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఒత్తిడిని నయం చేస్తుంది. వారానికి రెండుసార్లు మునగాకును ఆహారంలో చేర్చుకుంటే.. వైద్యుల వద్దకు వెళ్ళాల్సిన పనే ఉండదు. మధుమేహవ్యాధిగ్రస్థులకు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన 20 అమినో యాసిడ్లు ఈ మునగాకులో 18 వున్నాయి. విటమిన్-ఎ, సిలతో పాటు పొటాషియం ఇందులో వున్నాయి.
 
పిడికెడు మునగాకును ఒక టీ స్పూన్ నేతిలో వేయించి.. మిరియాలు, జీలకర్ర పొడి చేర్చి రోజూ ఉదయం వేడి వేడిగా ఉన్న అన్నంలో కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పలురెట్లు పెరుగుతుంది. సంతానలేమికి కూడా మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది.
 
పెరుగులో ఉన్న పీచు, ఆరెంజ్‌లో ఉన్న పోషకాల కంటే ఏడింతలు మునగాకులో పోషకాలు పుష్కలంగా వున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇతర ఆకుకూరల్లో ఎండితే పోషకాలు మాయమవుతాయి. కానీ మునగాకు ఎండినా అందులోని పోషకాలు మాత్రం పదిలంగా వుంటాయని వారు చెప్తున్నారు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments