Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీజీ గుప్పెట్లో అయోధ్య నగరం - పటిష్ట బందోబస్తు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (09:21 IST)
రామ మందిరానికి భూమిపూజ జరిగే అయోధ్య నగరం ఇపుడు పూర్తిగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈ భూమిపూజా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు వీవీఐపీలు అయోధ్య నగరానికి వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో పటిష్ట భద్రను కల్పించారు.
 
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ప్రముఖులు, 135 సంస్థలకు చెందిన వివిధ మత సంస్థలకు చెందిన సాధువులు తరలిరానున్నారు. ఇప్పటికే భూమిపూజ సందర్భంగా ఉగ్రదాడులు జరగవచ్చన్న ఇంటిలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఇప్పటికే అయోధ్య పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. 
 
నగరంలో రాకపోకలపై ఆంక్షలు భద్రతా బలగాలు ఆంక్షలు విధించాయి. అయోధ్యను ఆనుకొని ఉన్న 9 జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య - నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న బస్తీ డివిజన్‌లో ప్రత్యేకంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై నిఘా పెంచారు. 
 
రామాలయ భూమిపూజలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ కఠినంగా పోలీస్‌ అధికారులు అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల లోపు ఉండి, కరోనా నెటిగివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. భద్రతలో భాగంగా జిల్లా సరిహద్దులు మూసివేయడంతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పట్టణంలోకి వచ్చే మార్గాలను మూసివేయడంతోపాటు 75 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 
 
ట్రాఫిక్‌ పర్యవేక్షణకు డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాయుధ పోలీస్‌ బలగాలతో పాటు ప్రావిన్షియల్ సాయుధ కాన్స్టాబులరీ (పీఏసీ), కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఏపీఎఫ్‌)ను మోహరించనున్నారు. ఇప్పటికే యూపీ డీజీపీ, చీఫ్‌ సెక్రెటరీతో పాటు సీనియర్‌ అధికారులంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments