Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-12-2020 నుంచి 19-12-2020 వరకూ మీ వార రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (23:20 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షా సమయం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. కార్యసిద్ధికి పట్టుదలతో శ్రమించాలి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. కుటంబ విషయాలు ఏకరవు పెట్టొద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏ సంబంధం కలిసిరాక నిస్తేజానికి లోనవుతారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రతాలోపం. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసి వస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బంధుమిత్రుల వైఖరి అసహనం కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆది, సోమ వారాల్లో ఖర్చులు విపరీతం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పత్రాలు సమయానికి కనిపించవు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాభివృద్దికి పథకాలు రూపొందిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమస్యలు సద్దుమణుగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. మంగళ, బుధ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పత్రాలు అందుకుంటారు. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పరిచయాలు బలపడతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అనుకూలమే. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభ యోగం. కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఎదుటివారికి మీ సమర్థతపై గురి కుదురుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం వుంది. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం చికాకు పరుస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సహాయం ఆశించవద్దు. కొంతమంది మీ నుంచి విషయ సేకరణకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పొదుపు ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆప్తులను ఆదుకుంటారు. శని, ఆది వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. గృహమార్పు కలిసి వస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. మీ ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. సోమ, మంగళ వారాలలో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది. అధికారులకు హోదా మార్పు, స్థానం చలనం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చేసిన పనులే తిరిగి చేయాల్సి వస్తుంది. బుధవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులు అనుకూలించవు. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనకు అనుకూలం. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు ధనం అందుకుంటారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెలకువ వహించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. శనివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా ముగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఇరువర్గాల వారు మీ సలహా పాటిస్తారు. ధన లాభం, ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమ వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయాలు బలపడతాయి. ఇతురుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments