ప్రతిరోజు లక్ష్మీగణపతిని పూజించండి(జి.శ్రీధర్-అనకాపల్లి)

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (17:05 IST)
జి.శ్రీధర్-అనకాపల్లి: మీరు అమావాస్య బుధవారం, ధనుర్ లగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ఆర్థిక ఒడిదుడుకులు, ఒత్తిడి, చికాకు, ఉద్యోగంలో సమస్యలు, అపనిందలు, అపవాదులు, స్థిరత్వం లేకపోవడం వంటివి ఎదుర్కొంటారు. ప్రతి శనివారం 18సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించి అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. 3 నెలలకు ఒక శనివారంనాడు 250 గ్రాములు మినపప్పు, 250 గ్రాములు బియ్యం, 250 గ్రాముల బొబ్బర్లు, 250 గ్రాముల పెశరపప్పు శుక్రవారం నాడు నానబెట్టి శనివారం నాడు ఉదయం ఆవులకు అరటి ఆకులో పెట్టండి. 
 
ఈ విధంగా 2017 వరకు చేసినా మీకు సర్వదోషాలు తొలగిపోతాయి. 2014 సెప్టెంబరు నుంచి బుధ మహర్దశ ప్రారంభమయింది. ఈ బుధుడు మీకు 2017 నుంచి 2031 వరకు యోగాన్ని, అభివృద్ధిని ఇస్తాడు. 2016 నందు మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు బాగుగా స్థిరపడతారు. ప్రతిరోజు లక్ష్మీగణపతిని పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది. ఉద్యానవనంలో మద్ది చెట్టును నాటిని మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments