Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీత గారూ.. 2014లోపు మీకు గ్రీన్ కార్డు లభిస్తుంది..

సునీత - చీరాల :

Webdunia
FILE
సునీత - చీరాల :

మీరు తదియ గురువారం, వృషభలగ్నము, పునర్వసు నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. వర్తమానం 2010 నుంచి బుధ మహర్థశ ప్రారంభమయింది.

ఈ బుధుడు 2014 నుంచి 2027 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తాడు. 2014 లోపు మీకు గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతీ రోజు రాజరాజేశ్వరి అష్టకం చదవండి లేక వినండి సత్ ఫలితాలు ఉంటాయి. 2018 లేక 2019 వరకు విదేశాలలో ఉంటారు. తదుపరి స్వదేశంలో మంచి మంచి అవకాశాలు లభించి ఉన్నత స్థితిలో స్థిరపడతారు.

అప్పుడప్పుడు నడుము, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యములో మెళుకువ అవసరం. గరుడపచ్చ అనే రాయిని 7 క్యారెట్లు ధరించినా మీకు శుభం కలుగుతుంది.

మీ భర్త సంపత్ కుమార్ : మీరు పాడ్యమి శుక్రవారం, కుంభలగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటక రాశినందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి పచ్చని పూలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి.

ఏదైనా దేవాలయాల్లోగాని, విద్యాసంస్థల్లో గాని, ఖాళీ ప్రదేశాల్లో గాని బొప్పాయి చెట్టును నాటండి శుభం కలుగుతుంది. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది. 2012 నుంచి రవి మహర్థశ ప్రారంభమవుతుంది.

ఈ రవి 6 సంవత్సరములు 70 శాతం యోగాన్ని ఇస్తుంది. 2014 లోపు మీకు మంచి మంచి అవకాశాలు లభించి ఉన్నత స్థితిలో స్థిరపడతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. 2018 వరకు పురోభివృద్ధి కానవస్తుంది. 2018 నుంచి చంద్ర మహర్థశ 10 స ం|| ము, కుజ మహర్థశ 7 స ం|| ములు సత్‌ఫలితాలు ఉండగలవు. స్టార్ రూబి అనే రాయిని 9 క్యారెట్లు ధరించినా కలిసిరాగలదు.

మీ కుమార్తె సాహితి : విదియ బుధవారం, కుంభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్ర, రాహువులు ఉండటం వల్ల చదువుల్లో బాగుగా అభివృద్ధి చెందుతారు. 10 వ సంవత్సరము వరకు సామాన్యంగా ఉన్న ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది.

సైన్సు లేక వైద్య రంగాలలో బాగుగా అభివృద్ధి చెందుతారు. 25 లేక 25 స ం|| ము నందు బాగుగా స్థిరపడతారు. 25 లేక 26 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వైక్రాంతిమణి అనే రాయిని 3 క్యారెట్లు ధరించినా శుభం కలుగుతుంది.

శ్రీహర్షిత్ : ద్వాదశి మంగళవారం, మకర లగ్నము, పునర్వసు నక్షత్రం మిథునకరాశి నందు జన్మించారు. షష్ఠమ స్థానము నందు శుక్ర, చంద్రులు ఉండటం వల్ల ఒక సబ్జెట్‌లో మాస్టర్ చేసాడు. మంచి పట్టుదల, మొండితనం కలిగి అనుకున్నది సాధిస్తాడు. 30 లేక 31 స ం|| ము నందు వివాహం అవుతుంది. విద్యావంతురాలైన భార్య లభిస్తుంది. వైక్రాంతమణి అనే రాయిని 2 క్యారెట్లు ధరించినా మీకు శుభం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

Show comments