Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త, కుమారుడు మరియు నా జాతక వివరాలను దయచేసి తెలుపగలరు...

విద్యుల్లత- విశాఖపట్టణం

Webdunia
విద్యుల్లత- విశాఖపట్టణం:
మీరు సప్తమి బుధవారం వృషభలగ్నము రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. మీకు లగ్నము నందు గురు చంద్రులు ఉండటంవల్ల ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా మంచి సమయం ఆసన్నమవుతుందని గ్రహించి.. సద్వినియోగం చేసుకోండి. మీ భర్త కారకుడైన కుజుడు విరోధిక్షేత్రము నందు ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలలో చికాకు, నిరుత్సాహం, ఆందోళనలు ఎదుర్కొన్నా నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ సిద్ధిగణపతిని ఆరాధించండి. 2004 నుంచి మీకు గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు మీకు 2012 నుంచి యోగాన్నిస్తాడు. స్పందనముత్యం ధరించండి మీకు కలిసివస్తుంది.

మీ భర్త శ్రీనివాసరావు షష్టి ఆదివారం, మీన లగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. మీకు చతుర్థస్థానములో శని, కేతువు కలయిక వల్ల రాజ్యస్థానము నందు లేక ఉద్యోగస్థానము నందు రవి, బుధ, రాహువు ఉండటం వల్ల పర్మినెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాలలో తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. 2012వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి. కలిసివస్తుంది. 2011 నుంచి బుధ మహర్ధస 17 సంవత్సరములు మంచి అభివృద్ధి నిస్తుంది. ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.

ఇకపోతే మీ కుమారుడు వాగేష్ తదియ ఆదివారం, వృషభలగ్నము, రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. వృషభలగ్నం, వృషభరాశి ఒకటే కావడం వల్ల ఒక్కోసారి మొండితనం కనబరిచినా చదువుల్లో బాగా అభివృద్ధి చెందుతారు. మీ కుమారుడు సైన్స్, టెక్నికల్ రంగంలో బాగా రాణిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల చదువుల్లో బాగా రాణిస్తారు. 2036 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరములు, శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి యోగాన్నిస్తుంది. మీ కుమారుడు 24లేక 25 సంవత్సరము నందు బాగా స్థిరపడతాడు. 27 సంవత్సరము నందు అతని ఇష్టానుసారం వివాహం చేస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments