Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-04-22 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
వృషభం :- మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సంఘంలో మీ మాటకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
మిథునం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి.
 
కర్కాటకం :- గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తి పరచండి. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహరాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించ గలుగుతారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఫైనాన్సు, చిట్‌ఫండ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం.
 
తుల :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలేర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసివస్తుంది. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపటం మంచిది.
 
వృశ్చికం :- చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. ఆధ్యాతిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు :- ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం.
 
మకరం :- వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని అవకాశాలు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. 
 
కుంభం :- ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అకాల భోజనంవల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మీనం :- ఆర్థిక సమస్యలు తలెత్తుట పల్ల ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జూగ్రత్తలు అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

లేటెస్ట్

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments