Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-04-22 శుక్రవారం రాశిఫలాలు - కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం...

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- ఆర్థికస్థితి మునుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. మిత్రుల కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు చికాకులు అధికం. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
వృషభం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మిథునం :- ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- విదేశాలలోని క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. మీ సంతానం ఉన్నతి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
సింహం :- విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన మీ ధ్యేయం నెరవేరగలదు.
 
కన్య :- స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆస్తి పంపకాలలో పెద్దల తీరు మిమ్ములను ఇరకాటంలో పెట్టవచ్చు. సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు.
 
తుల :- వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెలకువ అవసరం. మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత మెళుకువ చాలా అవసరం. రుణాల కోసం యత్నిస్తారు. కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వాతావరణంలో వచ్చి మార్పు, శారీరక శ్రమ వల్ల మీ ఆరోగ్యం మందగిస్తుంది. నూతన వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. వ్యాపార వర్గాల వారికి పన్నులు, ప్రభుత్వ విధానాలు అందోళన కలిగిస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు.
 
మకరం :- బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్ళు అధికం. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి కాగలవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. అధికారులకు సాదరవీడ్కోలు పలుకుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

లేటెస్ట్

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

తర్వాతి కథనం
Show comments