Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-10-2021 గురువారం దినఫలాలు - కుబేరుడిని ఆరాధించిన శుభం

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (05:00 IST)
మేషం :- చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో కలసి ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం :- ప్రైవేటు సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. సేవ, సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు. మీ వాక్చాతుర్యానికి, మంచి తనానికి గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం.
 
కర్కాటకం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు తరచు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం.
 
సింహం :- వస్త్ర బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
కన్య :- రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఒక వ్యవహారంలో సోదరుల నుండి పట్టింపులు, వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.
 
తుల :- వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహమతులు అందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.
 
వృశ్చికం :- అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తులు, మార్కెట్ రంగాల వారికి శ్రమ అధికం, ఆదాయం స్వల్పం. మీ అంచనాలు, పథకాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. బంధు మిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. 
 
మకరం :- రాజకీయనాయకులు తరచు సభాసమావేశాలలో పాల్గొంటారు. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. అందరితో కలుపుగోలుగా మెలిగి మన్ననలు పొందుతారు.
 
కుంభం :- ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. దూరప్రదేశంలోని ఆత్మీయులు, సంతానంతో సంభాషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాబోయే అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు.
 
మీనం :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments