Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-11-2021 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో ఉండే ధునిలో...

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (04:00 IST)
మేషం : - ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. కోర్టు వ్యవహారాలు విచారణకువస్తాయి.
 
వృషభం :- ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్త్రీలకు పనివారాలతో చికాకులు, అసహనం తప్పవు.
 
మిధునం :- మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన తప్పడు. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. ఒక శుభకార్యం నిశ్చయంకావటంతో స్త్రీలతో ఉత్సాహం, ఆందోళన అధికమవుతాయి. పుణ్య క్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కర్కాటకం :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత ఉంటాయి. విద్యార్థులు పరీక్షలు, పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
సింహం :- బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తప్పవు. ప్రముఖులకు విలువైన కానుకలు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకుంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగటం మంచిది.
 
కన్య :- ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారితో సమస్యలు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు, బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాల విస్తరణ, నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోకుండా ఒక శుభకార్యం చేపడతారు. ఖర్చులు రాబడికి మించటంతో ఒకింత ఆందోళన తప్పదు.
 
వృశ్చికం :- మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది.
 
ధనస్సు :- ఉద్యోగ, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. స్త్రీలు దైవ, శుభ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టు కుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
మకరం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. గత విషయాలు జప్తికి రాగలవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కుంభం :- ఉద్యోగస్తుల హోదా పెరగటం, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభఫలితాలుంటాయి. మీ హోదా చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సివస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. పీచు, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు మిశ్రమఫలితం.
 
మీనం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం లోపిస్తుంది. ఉద్యోగయత్నాలు, మార్పులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలన్న మీ ధ్యేయం నెరవేరగలదు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావటంతో ఆందోళన చెందుతారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నారా? అయితే, ఇది ఉండాల్సిందే..

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments