Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-12-2021 శనివారం రాశిఫలాలు : అనంతపద్మనాభస్వామిని పూజించిన...

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. స్త్రీలకు అయిన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అయిన వారు మీ నుంచి ధనసహాయం ఆశిస్తారు. సంఘంలో పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.
 
మిథునం :- వస్త్రవ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆలయ సందర్శనాల కోసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతికి లోనవుతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్ర సందర్శనలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధు మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఓర్పు, నేర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారవల్ల నష్టపోవలసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన అవకావాలు లభిస్తాయి.
 
సింహం :- వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కన్య :- వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధువులతో కలిసి వేడుకలు, విందులలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం ఏకాగ్రతతో నడపాలి. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది.
 
తుల :- ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో కొన్ని అనుకున్నది సాధిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది.
 
వృశ్చికం :- రావలసిన ధనం కొంతముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూఏదీ ఉండదు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. సంతానం విద్యా విషయాలు, కళత్ర ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. 
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఇతర వ్యాపకాలు విడనాడి విధినిర్వహణలో ఏకాగ్రతతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
మకరం :- విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. నూతన వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. వైద్యులకు ఒత్తిడి, పనిభారంతప్పవు.
 
కుంభం :- రావలసినధనం సకాలంలో అందుకుంటారు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. బంధువులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు.
 
మీనం :- మత్స్య, కోళ్ళ గొర్రెల వ్యాపారస్తులకు సామాన్యం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

తర్వాతి కథనం
Show comments