Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-11-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన...

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ప్రభుత్వాధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం కాగలవు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. 
 
వృషభం :- ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచిస్పందన లభిస్తుంది. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అధికారులకు విధి నిర్వహణలో ఆటంకాలు, సమస్యలు తలెత్తుతాయి.
 
మిథునం :- ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కుటుంబంలో ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకుసాగండి. ఆప్తుల ఆహ్వానం అందుతుంది. పనులు నెమ్మదించినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు.
 
కర్కాటకం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ద్విచక్ర వాహనచోదకులకు చికాకులు తప్పవు. దైవ కార్యాలకు సహాయం అందిస్తారు. వ్యవహారాలు మీ ఇష్టానుసారం జరుగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
సింహం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పాత రుణాలు చెల్లిస్తారు. బంధు, మిత్రులను కలుసుకుంటారు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
 
కన్య :- పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. వృత్తులవారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విందులలో పరిమితి పాటించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయనాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి. బిల్లులు చెల్లిస్తారు.
 
ధనస్సు :- మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచినధనం మరో దానికి వెచ్చిస్తారు. మొహమ్మాటాలు, ఒత్తిడి వల్ల ఇబ్బందు లెదుర్కోవలసి వస్తుంది. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వాగ్ధాటితో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
 
మకరం :- ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తుల సమర్థకు గుర్తింపు లభిస్తుంది. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు.
 
కుంభం :- కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పట్టు విడుపు ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
మీనం :- వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు, చికాకు లెదుర్కుంటారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

తర్వాతి కథనం
Show comments