Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-05-2023 శుక్రవారం రాశిఫలాలు - రాజరాజేశ్వరిని ఆరాధించిన శుభం

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (04:00 IST)
Raja Rajeswari
రాజరాజేశ్వరిని ఆరాధించిన శుభం కలుగుతుంది
 
మేషం:- వస్త్ర పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. దైవ, పుణ్య సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ సాన్నిత్యాన్ని కోరుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్లఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఆస్థి వ్యవహారాల్లో సోదరీ, సోదరుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం:- మీ అభిరుచికి తగినవ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
కర్కాటకం:- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి.మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు.
 
సింహం:- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసివస్తుంది. చేతివృత్తుల వారికి అవకాశాలు లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
కన్య:- ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది.
 
తుల:- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. బాకీలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన బకాయిలను లౌక్యంగా వసులు చేసుకోవాలి. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులను అతిగా నమ్మవద్దు.
 
వృశ్చికం:- రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
 
ధనస్సు: – ఆర్ధిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహమునకు వస్తువులు సమకూర్చుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారికి నుంచి విమర్శలు తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
 
మకరం:- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణ పనులలో పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉన్నతస్థాయి అధికారులు అపరిచితవ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కుంభం:- ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. రుణాలు తీరుస్తారు. స్త్రీలకు గొంతు, తలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మీ ప్రేమకు అందరి ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
మీనం:- సేవ, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలుచేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి, సంతానం ఆర్యోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments