Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేదీ 26-02-2023 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన శుభం...

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రాజకీయ నాయకులు సభలు సమావేశాలలో కొంత చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది.
 
వృషభం :- స్త్రీలకు పనిభారం అధికం. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు. ఉపాధ్యాయుల విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలసుకొని సంప్రదింపులు జరుపుతారు. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు.
 
మిథునం :- స్థిర చరాస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు.
 
కర్కాటకం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి పొందుతారు. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. తరుచూ విందులు వంటి శుభ సంకేతాలున్నాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయ సహకారాలు అర్థిస్తారు.
 
సింహం :- ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలపట్ల ఏకాగ్రత వహించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలలో మెళుకువ వహించండి.
 
కన్య :- ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో సఫలీకృతులుకాగలరు. స్త్రీలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రుణం తీర్చటానికై చేయు యత్నం వాయిదా పడుతుంది.
 
తుల :- స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులకు నిరుత్సాహం, ఎడబాటు తప్పవు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఆత్మీయుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
వృశ్చికం :- ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం స్ఫురిస్తుంది. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లటంతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ఏకాభావం కుదరదు. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించటం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు.
 
మకరం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా సజావుగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. స్త్రీలకు గృహ వాతావరణం, సంతానం వైఖరి వల్ల చికాకులు తప్పవు. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
కుంభం :- మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ నిర్ణయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.
 
మీనం :- మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వలన ఆరోగ్యం భంగం. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మిత్రుల సహయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

తర్వాతి కథనం
Show comments