25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

రామన్
గురువారం, 25 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సొంత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరవు. పనులు హడావుడిగా సాగుతాయి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణవిముక్తులవుతారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపులో మెలకువ వహించండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు నెలకొంటాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. అయిన వారిని సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. ధనలాభం ఉంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అవివాహితులు శుభవార్తలు వింటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం బాగుంది. లక్ష్యం సాధిస్తారు. బాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ జోక్యం అనివార్యం. ధనలాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
బంధువుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ సహనానికి పరీక్షా సమయం. మిమ్ములను తప్పుపట్టిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు సామాన్యం. మొండిగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సన్మాన, సంస్కరణ సభలో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments