Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-07-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సర్వదా శుభం...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (04:00 IST)
మేషం :- కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా కొనసాగుతాయి. మీ సమస్యలు, చికాకులు తాత్కాలికమేనని గమనించండి. మీరు అమితంగా అభిమానించే వారిని కలుసుకుంటారు. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాల పట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం :- బంధువుల రాక వల్ల స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు. రాజకీయ నాయకులుసభా సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
మిథునం :- స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. 
 
కర్కాటకం :- కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
సింహం :- కళా రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. క్రయ విక్రయదార్లకు అనుకూలంగా ఉండును.
 
కన్య :- ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కానవస్తుంది. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఆనందకరమైన హృదయంతో ఎలాంటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
 
తుల :- లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, క్రమశిక్షణ ముఖ్యం.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. విదేశీయాన యత్నాలు కొంతవరకు అనుకూలించగలవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
ధనస్సు :- ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. మీకున్న దానితో సంతృప్తి చెందండి. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాలో చురుకుగా పాల్గొంటారు. మీ అనుభవాలను ముఖ్యులతో పంచుకుంటారు. వడ్డీలు, డిపాజిట్లు చేతికందుతాయి.
 
మకరం :- ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాంఘిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానికల్, వైజ్ఞానిక, శాస్త్ర, కంప్యూటర్, టెక్నికల్ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. మిత్రులను కలుసుకుంటారు.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో ఇబ్బందు లెదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. బదిలీలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుంచుకుంటారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాస్తులకు శుభదాయకం.
 
మీనం :- సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాక ఇబ్బందు లెదుర్కుంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశంతత నెలకొంటుంది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. ట్రాన్సుపోర్టు, అటోమోబైల్ రంగాలలో వారికి మంచి మంచి అవకాశాలు లభించి పనిభారం అధికమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో సింహ రాశి జాతకుల కెరీర్, వ్యాపారం ఇలా వుంటుంది..

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments