Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

రామన్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర బ॥ విదియ పూర్తి విశాఖ రా.1.17 ఉ.వ.5.44 ల 7.26 తె.వ.5.27ల ఉ.దు.10.01 ల 10.50 ప.దు. 2.54 ల3.43.
 
మేషం :- పారిశ్రామిలకులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. పౌరోహితులకు, వృత్తులలో వారికి ఒత్తిడి తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి కలిసివచ్చేకాలం. కొంత మంది ఆర్థిక సహాయం అర్థిస్తారు. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు. కార్మికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
వృషభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. బాధ్యతలు నెరవేర్చి ప్రశంసలు పొందుతారు. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం. ధన వ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం.
 
మిథునం :- విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతుంది. పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్నపనులు సకాలంలో పూర్తి కాగలవు. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. టెండర్లు చేజిక్కించుకుంటారు.
 
కర్కాటకం :- ప్రైవేట్ సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం.
 
సింహం :- మధ్యవర్తిత్వం వహించుట వలన సమస్యలను ఎదుర్కుంటారు. ఊహగానాలతో కాలం వ్యర్థంచేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. చదువు, వ్యాపారాలపై దృష్టి పెడతారు. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు.
 
కన్య :- వృత్తుల వారికి బాద్యతలు పెరుగును. వెండి, బంగారు, లోహ, రత్న వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. కుటుంబీకుల కోసం నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యల పట్ల శ్రద్ధ పెరుగును. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
తుల :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు మానసికాందోళనకు గురవుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. శ్రమ తప్ప ఫలితం కనిపించడదు. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాలపట్ల ఆసక్తి పెరుగును.
 
వృశ్చికం :- చిన్న తరహా పరిశ్రమలలోని వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. అదనంగా వచ్చే ఆదాయం సంతృప్తినిస్తుంది. గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడతాయి. వ్యాపారాలలో మీ శ్రమ వృథాకాదు.
 
ధనస్సు :- కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. రుణబాధలు వంటివి తీరగలవు. ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
మకరం :- వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడిలు తప్పవు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. బిల్డర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు తగదు. అనుకున్న నిధులు చేతికి అందకపోవచ్చు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవచ్చును. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మీనం :- మీ ప్రత్యర్థుల తీరు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, వాహన యోగం పొందుతారు. స్త్రీల ఆరోగ్యంలో జాగ్రత్తలు వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడచుకుంటారు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహంలభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain Dies ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

ప్రతిదీ అసాధ్యం అని చెప్పే వారిని నమ్మవద్దు: స్వామి వివేకానంద

January horoscope 2025 in Telugu: జనవరిలో ఏ రాశుల వారికి అనుకూలమో తెలుసా?

తర్వాతి కథనం
Show comments