Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

రామన్
ఆదివారం, 23 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు ముందుకు సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. సన్నిహితులను విందులుకు ఆహ్వానిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోధైర్యంతో మెలగండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆప్తులను కలుసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. పనులు పురమాయించవద్దు.. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పనులు మొదలెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. వేడుకకు హాజరుకాలేరు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments