Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-02-2024 శుక్రవారం దినఫలాలు - రాజ రాజేశ్వరి అమ్మవారిని పూజించిన శుభం...

రామన్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ చతుర్ధశి ప.3.18 ఆశ్రేష రా.7.21 ఉ.వ.7.10 ల 8.55. ఉ.దు. 8.50 ల 9.35 ప. దు 12. 36 ల 1.21.
రాజ రాజేశ్వరి అమ్మవారిని పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- అయిన వారితోనైనా వ్యవహారంలో ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
వృషభం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. మీ యత్నాలో నిర్లక్ష్యం, పనులు వాయిదా కూడదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
 
మిథునం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
కర్కాటకం :- గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు శారీరకపటుత్వం నెలకొంటుంది. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
సింహం :- కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండగకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. చిన్న తప్పిదాలే సమస్యగా మారే ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత మెళుకువ అవసరం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంమంచిది.
 
కన్య :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
తుల :- పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి, నిరుద్యోగులకు కలిసివచ్చేకాలం.
 
వృశ్చికం :- బంధువుల రాక వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. కొంతమంది మీ దృష్టి మళ్ళించి మోసగించే ఆస్కారం ఉంది. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన లేఖలు అందుతాయి. రావలసిన ధనం వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- ఫైనాన్సు, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచేచేస్తుంది.
 
మకరం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాలల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తగలవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి.
 
కుంభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదర్శభావాలు గల వ్యక్తితో ఆత్మీయబంధం బలపడుతుంది.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పాత రుణాలు తీరుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments