Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-12-2023 సోమవారం రాశిఫలాలు - సుబ్రమణ్యస్వామిని పాలతో అభిషేకించిన శుభం...

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు॥ షష్ఠి సా.6.26 ధనిష్ఠ ఉ. 6.35 శతభిషం తె.4.48
ప.వ.1.15 ల 2.43. ప.దు. 12.11 ల 12.55 పు.దు. 2.23ల3.07.
సుబ్రమణ్యస్వామిని పాలతో అభిషేకించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- మీ కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు ఎదటివారితో మితంగా సంభాషించటం ఉత్తమం. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. పత్రిక, ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. రావలసిన ధనంచేతికి అందక పోవడం వలన చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం :- ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనాలోపం. సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. విదేశీ చదువులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగు, స్టేషనరీ వ్యాపారస్థులు ఒత్తిడిని, శ్రమను అధికంగా ఎదుర్కొంటారు. స్త్రీల ధ్యేయం నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి.
 
కర్కాటకం :- విద్యార్థులు స్వయంకృషితో రాణిస్తారు. సమయానికి మిత్రులు సహకరించటం వల్ల అనుకున్నది సాధిస్తారు. మీ మనోభావాలకు మంచిస్ఫురణ లభిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిర, చరాస్థుల విషయంలో ఒక నిర్ణయానికివస్తారు. 
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రావలసిన ఆదాయంపై దృష్టి సారిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వలన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫైనాన్స్, వ్యాపారస్థులు మెళుకువ వహించండి. 
 
కన్య :- రాజకీయనాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కొంత మంది సూటిపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలం. రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
తుల :- ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతారు. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది. సోదరికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.
 
వృశ్చికం :- సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
ధనస్సు :- నిరుద్యోగులు బొగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు అలసట అధిక శ్రమ తప్పదు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం.
 
మకరం :- ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలిగిపోతాయి. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి.
 
కుంభం :- స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చు చేస్తారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్నిపొందుతారు. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
మీనం :- సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. స్త్రీలపట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. సన్నిహితులు నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

తర్వాతి కథనం
Show comments