Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

రామన్
మంగళవారం, 18 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
యత్నాలు విరమించుకోవద్దు. ఆపన్నులకు సాయం అందిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏకాగ్రతతో వ్యవహరించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. సన్నిహితుల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం : పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు నెరవేరవు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. కృషికి అదృష్టం తోడవుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. సోదరుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పాతమిత్రులు తారసపడతారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనవసర విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఖర్చులు అధికం. ధనసహాయం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. పొగిడేవారితో జాగ్రత్త. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పిల్లల దూకుడు కట్టడి చేయండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Pawan Kalyan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. వైఎస్సార్ పేరు తొలగింపు

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

14-03-2025 శుక్రవారం రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది.

Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి

Holi Pournima- హోలీ పౌర్ణమి పూజ ఎలా చేయాలి.. రవ్వతో చేసిన స్వీట్లను నైవేద్యంగా?

తర్వాతి కథనం
Show comments