Webdunia - Bharat's app for daily news and videos

Install App

14-12-2022 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన...

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, అవాంతరాలు తప్పవు. 
 
వృషభం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. సజ్జన సాంగత్యం మీ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. కోర్టు వాజ్యాలను ఉపసంహరించుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
మిథునం :- మీ ఆలోచనలు, అభిప్రయాలను గోప్యంగా ఉంచండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.
 
కర్కాటకం :- మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. హోటల్, తినుబండా వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతల నుంచి విశ్రాంతి పొందుతారు.
 
సింహం :- రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
కన్య :- పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బ్యాంకుల్లోమీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొన్ని చిక్కు సమస్యల నుంచి విముక్తులవుతారు.
 
తుల :- ఉద్యోగస్తులకు తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. మీరు మీ సొంతానికి కాకుండా ఇతరులకు ఉపయోగపడతారు. దుబారా ఖర్చుల అదుపు సాధ్యం కాదు. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. సోదరుల మధ్య ఏకీభావం ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- నూతన వ్యక్తుల పరిచయం, వారితో సంభాషించేటపుడు చాలా జాగ్రత్త అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. రిప్రజెంటేటివులకు సంతృప్తికానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.
 
ధనస్సు :- ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమానంతో ఏకీభావం లోపిస్తుంది. శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలు పెడతారు. మీదికాని వస్తువును ఆశించటం వల్ల భంగపాటుకు గురవుతారు.
 
మకరం :- స్త్రీలు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణం, మరమ్మతులు వాయిదాపడతాయి. వాహన చోదకులకు నోటీసులు, జరిమానా చెల్లింపులు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు.
 
కుంభం :- ఆశలొదిలేసుకున్న బాకీలు సైతం వసులు కాగలవు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. కొన్ని అవసరాలు, ఖర్చులు వాయిదా వేసుకుంటారు. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెటు భిన్నంగా ఉంటాయి.
 
మీనం :- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విద్యార్థుల నిర్లక్ష్యం, మతిమరుపు కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. గృహమార్పుతో సంభవించే ఫలితాలను గమనిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

తర్వాతి కథనం
Show comments