Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

Advertiesment
astrology

రామన్

, బుధవారం, 14 జనవరి 2026 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్యలు తొలగిపోతాయి. తాకట్టు విడిపించుకుంటారు. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వేడుకను ఘనంగా చేస్తారు. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఆడంబరాలకు ఖర్చు చేస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణంలో సమస్యలెదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను విందుకు ఆహ్వానిస్తారు. పందాలు, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ నష్టం ఫలిస్తుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఖర్చులు అదనం. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పోటీల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నంచండి. ఖర్చులు అధికం, ప్రయోజనకం. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు, వేడుకలో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సాయకూలతకు మరింత శ్రమించాలి. వేడుకకు హాజరుకాలేరు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. అతిగా ఆలోచించవద్దు, సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనో ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో ఒత్తిళ్లకు గురికావద్దు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు, ఓర్పు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. చేపట్టిన పనులు సాగవు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాలు అందుకుంటారు. పందేలు, పోటీల్లో రాణిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?