Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-01-2026 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి...

Advertiesment
daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. అనునయంగా మెలగండి. స్థల వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్య నుంచి విముక్తులవుతారు. కొత్త ఆలోచనలు వస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దుబారా ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దైవకార్యానికి వ్యయం చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితులు వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ఖర్చులు అధికం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రియతములు గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు సాగవు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా యోగదాయకమే. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వ్యవహారాలతో తలమునకలవుతారు. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-01-2026 ఆదివారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు...