Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-01-2026 శుక్రవారం ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు...

Advertiesment
Astrology

రామన్

, శుక్రవారం, 9 జనవరి 2026 (00:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణసమస్య తొలగుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వదా అనుకూలమే. రుణసమస్య పరిష్కారమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వేడుకకు యత్నాలు సాగిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. న్యాయ వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి సాగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంంలో రాణిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఖర్చులు విపరీతం. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పోటీల్లో రాణిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. అవకాశం చేజారిపోతుంది. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడండి. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు నిలకడగా ఉండమంగళ, బుధవారాల్లో కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Srivani Darshan: ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.. ఎలా?