మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. వ్యవహారాలతో తీరిక ఉండదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ కించపరచవద్దు. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పుణ్యక్షేత్రం, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరిలో గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కృషి ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం. లిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. ఎదురుచూస్తున్న పత్రాలు సమయానికి అందుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం.
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. అతిగా ఆలోచింపవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి.. రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. విలువైన వస్తువులు జాగ్రత్త, కళాత్మక పోటీల్లో మహిళలు గెలుపొందుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో మెళలకువ వహించండి. ఖర్చులు అధికం.