Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-01-2026 శనివారం ఫలితాలు : సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది...

Advertiesment
daily horoscope

రామన్

, శనివారం, 10 జనవరి 2026 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. తలపెట్టిన పనులు త్వరితగతిన సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. వాహనదారులకు దూకుడు తగదు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దైవదర్శనాలు మానసికోల్లాసాన్నిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ రోజు ఆశాజనకం. ప్రధాన అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీలకపత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలిసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దైవకార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి వాహనయోగం ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. తలపెట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Leopard: శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి.. భక్తుల్లో భయం భయం