Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-06-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే శుభం

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (04:00 IST)
మేషం :- ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విద్యార్ధినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. మీపై శకునాల ప్రభావం అధికమవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగుశ్రద్ధ తీసుకుంటారు. గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కోర్టువ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
మిథునం :- ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పాత మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు తరుచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయ సలహా స్వీకరిస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది.
 
సింహం :- పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసరపు విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులకు ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో చికాకులు, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. రాజకీయనాయకులకు కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ అధికమవ్వటంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వాతావరణంలోని మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కోర్టుకు హాజరవుతారు. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
ధనస్సు :- శ్రీమతి, శ్రీవారు మధ్య అనుమానులు అపోహలు తలెత్తుతాయి. రుణం తీర్చి తాకట్టువస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనలు, మధ్యవర్తుల విషయంలో అవగాహన ముఖ్యం. బ్యాంకుపనులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.
 
మకరం :- అనవసరపు ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం అందినా దానికి తగినట్టుగానే ఖర్చులుంటాయి. 
 
కుంభం :- సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి.
 
మీనం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కొబ్బరి, మామిడి పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి లాభదాయకం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌ను గద్దె దించాను.. చిరకాల ధ్యేయం నెరవేరింది.. రేవంత్ రెడ్డి

బంగారు విగ్రహాలతో అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డ్- వైరల్

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2024 బుధవారం దినఫలాలు - లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి...

25-06-202 మంగళవారం దినఫలాలు - ఊహించని రీతిలో ధనలాభం పొందుతారు....

ఎంగిలితో చేతి వేళ్లను తడిపి డబ్బును లెక్కిస్తున్నారా?

24-06-2024 - సోమవారం... ఇతరులతో అతిగా మాట్లాడటం వద్దు

23-06-202 ఆదివారం దినఫలాలు - కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది...

తర్వాతి కథనం
Show comments