Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-11-2024 సోమవారం రాశిఫలాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

రామన్
సోమవారం, 11 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ ఊహలు ఫలిస్తాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. అదృష్టయోగమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పాతమిత్రులు తారసపడతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయుల సాయం అందిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విందులు, వేడుకలకు హాజరవుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కీర్తిప్రతిష్టలు పెంపొందుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విందులు, వేడుకలకు హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంకల్పబలమే విజయానికి దోహదమవుతుంది. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి వాహనయోగం ఉన్నాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments