Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

రామన్
ఆదివారం, 11 మే 2025 (04:02 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అయిన వారితో కాలక్షేపం చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. గుట్టుగా మెలగండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. బంధువులను కలుసుకుంటారు.. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు పురమాయించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మొదలు పెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో సతమతమవుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. రావలసిన ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం. పనులు ముందుకు సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తర్వాతి కథనం
Show comments