Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

రామన్
శనివారం, 10 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్ధికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. అనుభవ పూర్వకంగా అడుగులేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచికే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలను ధీటుగా స్పందిస్తారు. మీ కార్యదీక్ష ఆకట్టుకుంటుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఖర్చులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు ముందుకు సాగవు. చిన్నవిషయానికే చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ నిజాయితీ ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

తర్వాతి కథనం
Show comments