Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-10-2024 మంగళవారం దినఫలితాలు : ఖర్చులు అదుపులో ఉండవు...

రామన్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధువులతో సంభాషిస్తారు. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. మీదైన రంగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అపజయాలకు కుంగిపోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వస్త్ర, బంగారం వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. మొండి బాకీలను లౌక్యంగా రాబట్టుకోవాలి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

లేటెస్ట్

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

26-11-2024 మంగళవారం ఫలితాలు - మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

2025.. బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025: మిథునరాశి విద్యారంగంలో ఏ మేరకు రాణిస్తుంది?

తర్వాతి కథనం
Show comments