Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-04-2023 తేదీ శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం..

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేక పోతారు. సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యంగా ఉండగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు.
 
వృషభం :- ప్రముఖులకలయిక సాధ్యంకాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఉపాధ్యాయలు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
కర్కాటకం :- కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు.
 
సింహం :- ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచియుండటం శ్రేయస్కరం. కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులలో జాప్యం తప్పదు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుంటారు. మీ ఔన్నత్యాన్ని ఇతరులు గుర్తిస్తారు. వాగ్విదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
తుల :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉమ్మడి వ్యవహరాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
వృశ్చికం :- పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి.
 
ధనస్సు :- విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధు మిత్రుల కలయిక సంతోషపరుస్తుంది. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. 
 
మకరం :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
కుంభం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 
మీనం :- మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ మరింత ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలకై ఫ్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments