Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-04-2023 తేదీ శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (04:00 IST)
మేషం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా వ్యవహరించండి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కుటుంబీకులతో సరదాగా గడుపుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.
 
వృషభం :- వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొంత మంది మిమ్మల్ని ధన సహాయం అర్థించవచ్చు. ఖర్చులు అధికమైనా మీ ఆర్థికస్థితికి ఏ మాత్రం లోటుండదు. బంధువులు మీ స్థితిగతులను చూచి అసూయపడే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
మిథునం :- మధ్య, మధ్య ఔషధ సేవ తప్పదు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఊహించని సమస్యలు తలెత్తుటవల్ల పొదుపు ఆశ్యకత గుర్తుకువస్తుంది. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించగలరు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చి వెనక్కిపోయే ఆస్కారం ఉంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. ఒక కార్యార్ధమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత.
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఆపత్సమయంలో ఒకరిని ఆదుకోవటం వల్ల ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యలెదురవుతాయి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
కన్య :- కళాకారులకు, రచయితలకు, అభిమాన బృందాలు అధికం కాగలవు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవటం వల్ల ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల :- ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. నిర్మాణ పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. ఇతరులకు మీ వస్తువులను తస్కరించడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. మీ వాక్చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి.
 
మకరం :- విద్యార్థులకు సైన్సు, గణిత, టెక్నికల్, కంప్యూటర్ రంగాల్లో ప్రవేశం లభిస్తుంది. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడిలు తప్పవు. పాత మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ప్రేమికులకు మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాలవారికి కలసివచ్చే కాలం. చిరు వ్యాపారులకు లాభం. కుటుంబీకుల అభివృద్ధి కోసం పథకాలు వేస్తారు. నూతన అగ్రిమెంట్లకు అనుకూలం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంత మంది ఆర్థిక సహాయం అర్థిస్తారు. పాత వ్యవహారాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. విద్యుత్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. మధ్యవర్తిత్వం వహించుట వలన సమస్యలను ఎదుర్కుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

లేటెస్ట్

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

తర్వాతి కథనం
Show comments