06-06-2024 గురువారం దినఫలాలు - రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి...

రామన్
గురువారం, 6 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ బ॥ అమావాస్య సా. 5.58 రోహిణి రా.8.35 ప.వ.12.47 ల 2.21, రా.వ.2.08 ల 3.44. ఉ.దు. 9.48 ల 10.40 ప.దు. 3.00 ల 3.52.
 
మేషం :- వ్యాపారాల్లో నష్టాలు, ఆటుపోట్లు తొలగి గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థల సిబ్బందికి ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చాలా మంచిది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మిథునం :- స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు.
 
కర్కాటకం :- స్త్రీల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
సింహం :- మీ పట్టుదల, ఉత్సాహం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. బ్యాంకు వ్యవహారాలలో హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. కొబ్బరి, పండ్ల, పానీయ, చిరు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల పట్ల ఏమంత ఉత్సాహం ఉండదు. ముఖ్యమైన వాయిదాలు సకాలంలో చెలిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు పుట్టింటి వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు పై అధికారుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
వృశ్చికం :- ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో పెద్దలను సంప్రదించండి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం అందకపోవడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులెదురవుతాయి.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యాన్ని మెప్పించటం కష్టమవుతుంది. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. బంధువులతో మితంగా సంభాషించటం మంచిది. ఏ పని మొదలెట్టినా అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు.
 
మకరం :- భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సంబంధాలు బలపడతాయి. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు పథకాలు రూపొందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు, కొనుగోళ్ళు మీరే చూసుకోవటం మంచిది. ప్రముఖుల కోసం నిరీక్షించవలసి వస్తుంది.
 
కుంభం :- పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. రాజకీయాల్లోని వారికి విరోధుల వల్ల ఒత్తిడి, ఆందోళన తప్పదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విందులలో పరిమితి పాటించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

తర్వాతి కథనం
Show comments